లొకేషన్స్ వేటలో పెద్ది టీం 

Peddi Team Scouts Locations

 గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాపై  అంచనాలు భారీగా వున్నాయి.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్ళింది పెద్ది టెక్నికల్ టీం.అక్కడ ప్రస్తుతం లొకేషన్స్ ను వెతుకుతున్నారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్  స్టార్ట్ కానుంది. అలాగే అన్ని కుదిరితే త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.   

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.అక్టోబర్ లో సినిమాను పూర్తి చేయనున్నారు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.మార్చి 26న ఈసినిమా థియేటర్లోకి రానుంది. 


అయితే అదే రోజున నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ కూడా రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద పెద్ది ,ది ప్యారడైజ్ మధ్య ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.