బాలకృష్ణను కలిసిన భగవంత్ కేసరి టీమ్

Team Bhagavanth Kesari Celebrates National Award Triumph With Nandamuri Balakrishna

2023వ సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరి ఈ పురస్కారానికి ఎంపికైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలోనటించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి చిత్ర బృందం తాజాగా హీరో బాలకృష్ణను కలిసింది. ఈ మేరకు నేడు డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల, నిర్మాత సాహు గారపాటి బాలయ్యను కలుసుకుని అభినందనలు తెలిపారు.

ఇక ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు వ్యక్తిగతంగా కాకుండా, మొత్తం చిత్ర బృందం కష్టానికి లభించిన గుర్తింపు’ అని తెలిపారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ గౌరవాన్ని బాలయ్య అభిమానులకు అంకితమిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఈ విజయం తెలుగు సినీ ప్రేక్షకులందరికీ గర్వకారణంగా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.