టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్గా విడుదలచేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుండి తాజాగా ఒక అదిరిపోయే పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రగిలే రగిలే’ అంటూ సాగే ఈ పాట సాంగ్ మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచింది. “కింగ్డమ్ ఆగ్రహం రగిలే రగిలే రూపంలో వచ్చేసింది! అందరినీ ఉర్రూతలూగించే అడ్రెనలిన్ రష్, గూస్బంప్స్ కలిగించే మాస్ ఎనర్జీకి సిద్ధమవ్వండి!” అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే ఉంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్దార్థ్ బస్రూర్ పవర్ఫుల్ వాయిస్‌తో ఆలపించారు.
ఇక ఈ పాటలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, స్టయిలిష్ యాక్షన్ మూమెంట్స్, పవర్‌పుల్ లుక్స్ మాస్ ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. ఈ సాంగ్‌కి మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ మరోసారి తన మేజిక్ చూపించాడు. ఇక లిరిక్స్ పాక్షికంగా ప్రజల రగిలే మూడ్‌ను, విజయ్ పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించాయి. విజువల్‌గా భారీ స్థాయిలో చిత్రీకరించబడిన ఈ పాట, థియేటర్లలో మరింతగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. మొత్తానికి ‘రగిలే రగిలే’ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇదిలావుంటే, మరోవైపు కింగ్డమ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుక్ మై షోలో ఆన్లైన్ లింక్ ఒకటి ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచినట్టు మేకర్స్ తెలిపారు. ‘https://in.bookmyshow.com/movies/devarakonda/kingdom/ET00433664‘ అనే ఈ లింక్ ద్వారా టికెట్స్ పొందవచ్చని సూచించారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న (ఈ గురువారం) థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























