టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. కొన్నిరోజుల క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే రీసెంట్గా ఫస్ట్ సింగిల్ ‘హృదయం లోపల’ విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కింగ్డమ్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘అన్న అంటేనే’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ హృద్యమైన గాత్రంతో ఆలపించారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సాంగ్‌లో విజయ్ అన్నగా ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కనిపించారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























