2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్ అద్భుతమైన హ్యూమర్ మేళవించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్ వంటి ప్రముఖులు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన తమిళంలో ‘జయం, తనీ ఒరువన్, గాడ్‌ఫాదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, సురేశ్ పీటర్స్ మ్యూజిక్ అందించారు. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్‌ను తీసుకువచ్చాయి.
ఇప్పుడీ ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లలో అలరించబోతోంది. హనుమాన్ జంక్షన్ సినిమాను జూన్ 28న రీ-రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది. అయితే ఈ తరహా సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువయింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్ కొరవడుతున్న ఈ సమయంలో, హనుమాన్ జంక్షన్ మళ్లీ తన మ్యాజిక్‌తో హనుమాన్ జంక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: