కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రోతో రాగ ఈసినిమాకూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.తమిళంలో 100 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి యావరేజ్ అనిపించుకోగా తెలుగులో పూర్తిగా నిరాశపరిచింది ఇక ఈసినిమా ఈనెల 31న స్ట్రీమింగ్ లోకి రానుందని నెట్ ఫ్లిక్స్ నిన్న ప్రకటించగా ఇప్పుడు ఆ డేట్ మారింది.ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఈనెల 30 నుండి ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఇక ప్రస్తుతం సూర్య తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.జూన్ మొదటి వారంలో తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ కానుంది.ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తన్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి విడుదల చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమాను పూర్తి చేసి సూర్య నెక్స్ట్ తన 46వ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.ఈనెల 30న ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా సూర్య ఆలస్యంగా జాయిన్ కానున్నాడు.వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా మామితా బైజు హీరోయిన్ గా నటించనుంది.జివిప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























