కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. అందాల భామలు కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ నిన్న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో, హీరోయిన్స్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “భారత్ మాతాకీ జై. మేము ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో ఇక్కడికి వచ్చాం. సినిమా రిలీజ్ సందర్భంగా ఉత్సాహంగా రావాలని అనుకున్నాం. కానీ మన సైనికులు మన దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం.”
“మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి ఇక్కడ నుంచి సపోర్టే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చే కలెక్షన్స్ లో కొంత భాగం మన కోసం పోరాడే సైనికులకి, రక్షకులకు అందజేయనున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాం. వాయిదా వేయడం మంచిదా, కాదా అన్న దానిపై చర్చించాం.”
“సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థంచేసుకోరనే ధైర్యంతో సినిమాని విడుదల చేశాం. సినిమా విషయానికి వస్తే మొదటి నుంచి ఒక ఆహ్లాదకరమైన సినిమాని ఇవ్వాలని ప్రయత్నించాం. థియేటర్లో రియాక్షన్ చూసిన తర్వాత మేము అనుకున్న దాని కంటే అద్భుతంగా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరికీ మా కృతజ్ఞతలు.”
“శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ అద్భుతంగా అలరించారు. శ్రీ విష్ణు తన అన్ని సినిమాలు కంటే ఒక మెట్టు ఎదిగి సిక్సర్ కొట్టాడు. వెన్నెల కిషోర్ గారు ఫుల్ కిక్ ఇచ్చారు. భాను నందు చాలా చక్కని డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైనింగ్ గా సినిమా తీశారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గీత ఆర్ట్స్ నుంచి గత ఆరు నెలల్లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి. మాకు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























