ఆ సాటిస్ఫాక్షన్ వాళ్లకి ఇవ్వకూడదనే ఈ సెలబ్రేషన్స్ – నాని

Natural Star Nani Salute Indian Army at HIT 3 Blockbuster Success Meet

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు దేశంలో పరిస్థితి సెన్సిటివ్ గా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది. వాళ్లు చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయిందని ఒక సాటిస్ఫాక్షన్ కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది.”

“మనల్ని ఏమీ చేయలేకపోయారని స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీం తరపునుంచి ఏ బిగ్ సెల్యూట్. హిట్ 3 సినిమా విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.”

“మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. సతీష్, లీ చాలా అద్భుతమైనటువంటి ఫైట్స్ ని డిజైన్ చేశారు. తెలుగు సినిమాలో ఎప్పుడు చూడని ఫైట్స్ ని ఆడియన్స్ చూశారు. శైలేష్ తో వర్క్ చేయడం చాలా ఫన్ గా ఉంటుంది. తను చాలా కూల్ గా పని చేసుకుంటూ వెళ్తాడు. తను ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు.తనకిహిలేరియస్ కామెడీ టైమింగ్ ఉంది . తనతో నేను చేయబోయే నెక్స్ట్ సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు చాలా బాగుంది.”

“ఇది చాలా స్పెషల్ డే. నా ఫేవరెట్ ఫిలిం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీరిలీజ్ అయింది. హిట్3 సక్సెస్ సెలబ్రేషన్ జరుగుతోంది. శ్రీ విష్ణు సింగిల్ సినిమా రిలీజ్ అయింది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే సమంత ‘శుభం’ సినిమా గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వింటున్నాను. అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి.”

“ఈ సినిమా సందడి థియేటర్స్‌లో ఎనర్జీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి శేష్ కి నాకు మధ్య ఒక మంచి అనుబంధ ఉంది. హిట్2 తో అది మరింత పెరిగింది. ఇప్పుడు మా ఇద్దరినీ స్క్రీన్ మీద చూడడం పర్సనల్ గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థాంక్యూ సో మచ్. థాంక్యూ కార్తీ. మీరు ఇంకా సినిమా చూడాలి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళను.”

“శ్రీనిధి శెట్టిది ఫిల్టర్ లేని వ్యక్తిత్వం. చాలా హానెస్ట్‌గా మాట్లాడుతుంది. తను ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది. అందుగాను ప్రొడక్షన్ తరఫునుంచి ప్రొడ్యూసర్ నానిగా థాంక్యూ చెప్తున్నాను. మృదుల క్యారెక్టర్‌ని అద్భుతంగా చేసింది. మంచి టీమ్స్ నాతో ఉన్నందుకు గ్రేట్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. హిట్ 3 వండర్‌ఫుల్ జర్నీ. ఒక బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ చేస్తున్నాం. 2025 అటు ‘కోర్ట్’ ఇటు హిట్ 3.. వెరీ మెమరబుల్ ఇయర్. 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థాంక్యూ సో మచ్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.