సింగిల్‌ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ

Single Movie is Very Special in My Career, Says Actress Ivana

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్‌’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇవానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?

  • డైరెక్టర్ కార్తీక్ గారు ఒకరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాను. చాలా నచ్చింది. శ్రీ విష్ణు గారు. వెన్నెల కిషోర్ గారు, కేతిక గారు ఇలా చాలా అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు. గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప సంస్థ ఉంది. నేను తెలుగులోకి రావడానికి ఇదే యాప్ట్ అనిపించి చేశాను.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

  • ఇందులో హరిణి అనే పాత్రలో కనిపిస్తాను. నాది చాలా జోవియల్ అండ్ ప్లజెంట్ క్యారెక్టర్. హరిణి డాన్సర్. తన క్యారెక్టర్‌లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ అటాచ్‌మెంట్ ఉంటుంది. తాను ఎవరినైనా ఇష్టపడితే వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఈ క్యారెక్టర్‌ని ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
  • ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. నా కోయాక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను సెట్స్‌లో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించేదాన్ని. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్.
  • శ్రీ విష్ణు గారు తెలుగుని చాలా స్పీడ్‌గా మాట్లాడుతారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. తర్వాత మెల్లమెల్లగా అలవాటు పడ్డాను. ఆయన చాలా సపోర్ట్ చేశారు.

ఇది ఎలాంటి సినిమా?

  • ఇది చాలా ఫన్ మూవీ, ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. లాఫ్ రైడ్‌లా ఉంటుంది. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. కచ్చితంగా చాలా మంచి స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను.
  • ఈ సినిమా నా కెరియర్‌లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా క్యారెక్టర్ డాన్సర్ అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.
  • ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ విన్న వెంటనే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ ఎక్సైట్‌మెంట్‌ ఆడియన్స్‌లో కూడా ఉంటుందని నా నమ్మకం.

మీరు ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు అందరూ బుజ్జి కన్నా అని పిలవడం ఎలా అనిపించింది?

  • చాలా ఆనందంగా అనిపించింది. అది ‘లవ్ టుడే’ సినిమాలో నా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరుతో ఆడియన్స్ నన్ను పిలవడం చాలా ఆనంది ఆనందాన్నిచ్చింది.
  • ఒక క్యారెక్టర్ పేరుని గుర్తుపెట్టుకుని పిలవడం కంటే ఒక నటికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అలా పిలిచిన ప్రతిసారి నేను చాలా ఎంజాయ్ చేస్తాను.

శ్రీ విష్ణు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

  • శ్రీ విష్ణు గారు చాలా కూల్ పర్సన్. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. కాస్త ఇంట్రో వర్ట్ అనిపిస్తారు. కానీ కిషోర్ గారితో కలిసినప్పుడు మాత్రం చాలా హిలేరియస్‌గా ఉంటారు.
  • శ్రీ విష్ణు గారు నాకు డైలాగ్స్ రాసి ఇవ్వడం వెరీ మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌. అలాగే కేతిక శర్మ గారితో కూడా వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్‌పీరియెన్స్‌.

గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

  • గీతా ఆర్ట్స్ వెరీ పాపులర్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో నా తొలి తెలుగు సినిమా కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

డైరెక్టర్ కార్తీక్ గారి గురించి?

  • కార్తీక్ గారు తమిళ్ పర్సన్. ఆయనతో నేను తమిళ్ నే మాట్లాడేదాన్ని. చాలా కంఫర్టబుల్‌గా ఉండేది. ఆయన చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌.

సినిమా మ్యూజిక్ గురించి?

  • సినిమాలో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మిగిలిన పాటలు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతున్నాయి. మ్యూజిక్ కి ఈ సినిమాలో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కి మీ రియల్ లైఫ్ కి ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి?

  • హరిణి డాన్సర్. నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో తన క్యారెక్టర్ డాన్స్ అని తెలిసిన తర్వాత మళ్లీ డాన్స్ క్లాసెస్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేశాను నేను భరతనాట్యం నేర్చుకున్నాను.

మీకు డ్రీమ్ రోల్, జోనర్ ఏమైనా ఉందా?

  • ప్రత్యేకంగా ఏమీ లేదు. నేను చెల్లిగా, ప్రియురాలిగా ఇలాంటి పాత్రలు చేశాను. రాబోయే సినిమాల్లో కూడా జీవితానికి సంబంధించి పాత్రలు, రియల్ లైఫ్‌కి రిలేటబుల్‌గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని ఉంది.

మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు కదా?

  • అవును, అయితే సినిమాలని సీరియస్‌గా తీసుకున్నది మాత్రం ‘లవ్ టుడే’ తర్వాతే. చదువు ముందుగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా మాస్టర్స్ చేస్తున్నాను.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి?

  • తమిళ్ తో పాటు తెలుగులో సినిమాలు చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.