పాకిస్థానీ అంటూ ట్రోల్స్‌.. స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Actress Imanvi Esmail Responds Over Trolls on Her Amid Pahalgam Incident

కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో ఇస్లామిక్ తీవ్రవాదులు తాజాగా జరిపిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశంలో పాకిస్తాన్ కళాకారులను బహిష్కరించాలనే నినాదాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు పలువురు నెటిజన్లు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలలో నటిస్తున్న నటీనటులను తీసివేయాలనీ, లేనిపక్షంలో ఆయా సినిమాలను బాయ్‌కాట్ చేయాలనీ పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న ఇమాన్వీ ఇస్మాయిల్‌ పైన కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె పాకిస్థాన్ దేశానికీ చెందినదని, కనుక వెంటనే ఈ సినిమా నుండి తనని తొలగించాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇమాన్వీ ఇస్మాయిల్‌ తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.

ఈ ఉగ్రదాడిని ఖండించిన ఆమె ఈ ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని పేర్కొంటూ.. వారి మృతికి సంతాపాన్ని తెలియజేసింది. తాను పాకిస్థానీ అని, తన తండ్రి పాక్ మిలిటరీలో పనిచేశారని.. ఇలా రకరకాలుగా తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పింది. అంతేకాకుండా తాను ఇండో-అమెరికన్ అని స్పష్టం చేసింది. తనకు ఇంగ్లీష్ భాషతో సహా హిందీ, గుజరాతీ కూడా వచ్చని తెలిపింది. అలాగే తనకు తెలుగు భాష కూడా వచ్చని వెల్లడించింది. ఇక ఇమాన్వీ ఇస్మాయిల్‌ వివరణ తర్వాత ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడొచ్చని అంటున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.