ఆకట్టుకుంటోన్న VT15 సూపర్ ఫన్ ప్రోమో

VT15 Shoot Begins With a Super Fun Promo,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,VT15 Shoot Begins,Varun Tej,Merlapaka Gandhi,Thaman S,Ritika Nayak,UV Creations,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movies,Varun Tej VT15,Varun Tej VT15 Movie,Varun Tej VT15 Movie Update,Varun Tej VT15 Movie Shooting Update,Varun Tej VT15 Movie Shoot Begins,VT15 Movie Shoot Begins,VT15 Movie Shooting Update,VT15,VT15 Movie,VT15 Telugu Movie,VT15 Update,VT15 Movie Update,VT15 Movie Latest Update,VT15 Movie News,VT15 Shoot,VT15 Movie Shooting,VT15 Shooting,Varun Tej Upcoming Movie VT15,Varun Tej 15,Merlapaka Gandhi New Movie,Merlapaka Gandhi Movies,Comedian Satya,Varun Tej New Movie Announcement,Varun Tej Merlapaka Gandhi Movie,VT15 Movie Promo,Varun Tej VT15 Indo-Korean Horror Comedy,VT15 Fun Video

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). “When haunting turns hilarious!!” అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియోను పంచుకుంది. హీరో వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మరియు దర్శకుడు మేర్లపాక గాంధీ ముగ్గురూ ఒక టేబుల్ దగ్గర కూర్చుని సినిమాకు సంబంధించి చర్చిస్తుంటారు. అంతలో ఒక కొరియన్ అమ్మాయి కూడా వచ్చి వారితో జాయిన్ అవుతుంది. వీరిమధ్య జరిగే డిస్కషన్ ఫన్నీగా ఉండి అలరిస్తోంది.

హ్యూమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తవగా.. వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్‌ సెలెక్ట్ చేశారు.

ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాసినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. అలాగే తొలి ప్రేమ భారీ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. గతంలో ఆయన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కంచె’ సినిమా చేశారు. మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని తీశారు. ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.