రీసెంట్ గా క తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఇక ఈ హీరో రెండు రోజుల్లో దిల్ రూబా తో రానున్నాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ప్రమోషన్ ఈవెంట్ లో ఈసినిమా నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా నచ్చకపోతే నన్ను వచ్చి కొట్టొచ్చు అని సినిమా మీద వున్న నమ్మకంతో స్టేజ్ మీద చెప్పాడు.ఇక టీం ఇంకో అడుగు ముందుకేసి పెయిడ్ ప్రీమియర్లు వేయాలని చూస్తున్నారు. రేపు రాత్రి సెలక్టెడ్ థియేటర్లలో ప్రీమియర్లు వేయనున్నారు.అందులో గనక టాక్ పాజిటీవ్ గా టాక్ వస్తే అడ్వాంటేజ్ అవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా వుంది.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కిరణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటించగా మరో నటి క్యాతీ డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది.సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా గోపినాథ్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సరిగమ సినిమాస్ తో కలిసి రవి ,రాకేష్ రెడ్డి నిర్మించారు.
ఇక ఇదిలావుంటే కిరణ్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాడు.అందులో భాగంగా కె -ర్యాంప్ అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు నాని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా నిర్మిస్తున్నారు. ఇది కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: