గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్ సిద్దమైంది. విష్ణు మంచు హీరోగా నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘ఢీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2007లో వచ్చిన ఢీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. అలాగే మంచు విష్ణు సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతోంది.
ఈ మేరకు మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 28న రీ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో విష్ణు మంచు ఢీ మూవీ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించగా.. కోన వెంకట్, గోపి మోహన్ కథ అందించారు. జెనీలియా కథానాయికగా నటించగా.. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, ప్రేమ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























