గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలలో ఒకరైన సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన పలు సినిమాలు కూడా రీ-రిలీజ్ అయ్యి ఘనవిజయాన్ని అందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన అరుదైన రికార్డును అందుకున్నారు. డైరెక్ట్ రిలీజే కాకుండా రీ-రిలీజ్‌ల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారు మహేష్. ఆయన నటించిన మూడు సినిమాలు రూ.2కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని ఔరా అనిపించాయి. వీటిలో ‘బిజినెస్‌మేన్, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ఉన్నాయి.
వీటితోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా రూ.2కోట్లకు పైగా వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక ఈ సినిమాలన్నింటికీ బుక్ మై షో లో 100K+ టికెట్స్ బుక్ అవడం విశేషం. ఇదిలావుంటే, ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: