ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు – విశ్వ‌క్‌సేన్

Mass Ka Das Vishwak Sen Apologies Fans With Open Letter

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బహిరంగ లేఖతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు అనేక విమర్శలకు గురయ్యాయి. నెట్టింట విశ్వక్ విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో స్పందించిన విశ్వక్ సేన్ అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇకనుంచి తాను ప్రేక్షకులు మెచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా ఇలా తెలిపారు.. “అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ, ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా.”

“ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే (ప్రేక్షకులు)’’‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా.”

“అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్‌ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, నా కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.