నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా హీరో నాని కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన ఈ పోస్టర్లో నాని రా అండ్ పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర ఫెరోషియస్ నేచర్ ని తెలియజేస్తుంది. అర్జున్ బొటనవేలుపై కనిపించే గాయం అతని బాటిల్స్ ని సూచిస్తుంది, నెరిసిన జుట్టు క్యారెక్టర్ ని డెప్త్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ అద్భుతమైన పోస్టర్ అర్జున్ సర్కార్ జర్నీ, అతని ట్రాన్స్ పర్మేషన్ పై క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























