మ్యాడ్ స్క్వేర్ సెకండ్ సింగిల్ రిలీజ్

MAD Square Second Single Released

గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యాడ్ సినిమాలో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. తొలిభాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ ఈ మ్యాడ్ స్క్వేర్‌ మూవీకి కూడా డైరెక్షన్ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం మ్యాడ్ స్క్వేర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు సంప్రదాయ తెలుగు పంచెకట్టులో కనిపించి సందడి చేశారు.

ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి ‘లడ్డు గాని పెళ్లి’ అనే ఫస్ట్ సింగిల్ విడుదలైన విషయం తెలిసిందే. జానపద సంచలనం, గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఆలపించిన ఈ గీతం యువతను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి’ అనే ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యం అందించగా.. భీమ్స్, స్వాతిరెడ్డి ఆలపించారు. ఫుల్ మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మొత్తానికి ఈ సెకండ్ సింగిల్ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఇందులో నటించనున్న కథానాయికల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.