ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది. సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ మూవీ నుండి విడుదలైన నాలుగు లిరికల్ పాటలు కూడా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి సినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికి నమస్కారం. పుష్ప 1 సమయంలో బన్నీతో నార్త్ ఇండియాని వదలకు. అక్కడ నీకోసం ఎంతోమంది అభిమానులు ఉన్నారు అని. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ ఉంది.”
“సాధారణంగా ఏ సినిమా ఈవెంట్ కైనా వెళ్ళినప్పుడు ఆ సినిమాకు ఉపయోగపడేలా ఏదైనా మాట్లాడుతాము, కానీ ఈ సినిమాకు అటువంటి అవసరం లేదు. కాబట్టి సరదాగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సుమారు రెండు మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. అక్కడ బన్నీ, సుకుమార్ గారితో మాట్లాడుతూ ఉండగా సుకుమార్ నాకు సినిమాలో ఒక సీన్ చూపించడం జరిగింది.”
“ఆ సీన్ ఏంటంటే..? పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. అది చూస్తేనే నాకు అర్థం అయిపోయింది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ నుండి ఎంత మ్యూజిక్ చేయించుకోగలరు అంత చేయించుకోండి అని అన్నాను. ఇక డిసెంబర్ 4 సాయంత్రం నుండి ఈ సినిమా ఎలా ఉండిపోతుందనేది ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్షం కూడా పడుతుంది, ఇది కచ్చితంగా ఒక శుభమే” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/0PoNdZCAO5Q/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/apv5v6hkF70/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/ky0m8tJEigw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/sMvZDLRqDfU/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)