భైరవం.. మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్

Bhairavam Team Introduced Actress Divya Pillai as Poornima Role

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ అద్భుతమైన స్పందనతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్‌గా ఇంకో హీరో నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇటీవలే మరో హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గజపతి వర్మగా ఫెరోషియస్, రగ్గడ్ అవతార్‌లో కనిపించారు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కుమార్తె, నటి అదితి శంకర్ భైరవంలో నటిస్తున్నట్టు తెలిపిన చిత్ర బృందం.. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. అదితి ఇందులో వెన్నెల అనే పాత్ర పోషిస్తున్నట్టు తెలియజేసారు. ఈ క్రమంలో తాజాగా భైరవంలో నటిస్తోన్న మరో కథానాయికను పరిచయం చేసారు మేకర్స్.

ప్రముఖ మలయాళ నటి నటి దివ్య పిళ్లై ఓ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలియజేసారు. ఇక ఇందులో ఆమె పూర్ణిమ అనే పాత్రలో కనిపించనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దివ్య పిళ్లై సంప్రదాయ వస్త్రధారణలో బంగారు బొమ్మలా కనిపించి ఆకట్టుకుంది. చీరకట్టులో, జడలో పువ్వులతో, చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని దీపం వెలిగిస్తున్న దివ్య పిళ్ళై లుక్ అదిరిపోయింది.

కాగా నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే హరి కె వేదాంతం సినిమాటోగ్రాఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.