టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తనకు ఇంకో తమ్ముడని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన తాజాగా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇక తన చేతులమీదుగా జీబ్రా ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనంతరం మెగాస్టార్, సత్యదేవ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరంజీవి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు. తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను చెప్పినవన్నీ సత్యాలు. తన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఇంటెన్సుగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. తన వాయిస్ లో రిచ్ నెస్ వుంది. తన మొదటి చూసినప్పుడు నేను తెలుగు యాక్టర్ అనుకోలేదు.”
“కానీ తను మన వైజాగ్ అబ్బాయి తెలిసినప్పుడు తనతో మాట్లాడాలనుకున్నాను. అప్పుడే తను నేనంటే ఎంత ఇష్టమో చెప్పాడు. అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. తను చాలా మంచి యాక్టర్. అయితే తనకి సరైన సినిమాలు పడటం లేదనిపించేది. గాడ్ ఫాదర్ లో విలన్ రోల్ లో తను అత్యద్భుతంగా చేస్తాడాని నాకు నమ్మకం.”
“నేను నమ్మకం పెట్టుకున్నట్లే ఆ సినిమాలో అద్భుతంగా రాణించాడు. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తనకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశాలు వస్తాయి. జీబ్రాలో తను చాలా షటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చేశాడు. తనకి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. తమ్ముడు సత్యదేవ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా అద్భుతమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు చిరంజీవి.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: