మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మట్కా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. టీం అంతా పాల్గొనగా భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి హాజరై ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మట్కా విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈసారి మాత్రం గట్టిగా కొడతానని అన్నారు. వరుణ్ తేజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. బర్మా నుంచి వైజాగ్‌కి శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథ ఇది. వాసు చిన్నప్పటి క్యారెక్టర్‌లో కార్తికేయ నటించాడు. చాలా అద్భుతంగా చేశాడు. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అవినాష్ నాకు తమ్ముడు క్యారెక్టర్ చేశాడు.”
“ఇంకా ఈ సినిమాలో పనిచేసిన మీనాక్షి చౌదరి గారికి, నోరా గారికి, జాన్ విజయ్, నవీన్ చంద్ర, సత్యం రాజేష్ అందరికీ థాంక్యూ. నవీన్ చంద్ర ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిఓపి కిషోర్ వర్క్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. విజువల్ గా సినిమాని ఇంత గ్రాండ్ గా చేసిన కిషోర్ కి థాంక్యూ. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతంగా వైజాగ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాకి కిరణ్ చాలా పెద్ద ఎసెట్.”
“ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్ గారు మట్కా కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా అనిపించింది. నాలోని యాక్టర్ ని ఆయన పట్టుకున్నారనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ తర్వాత అందరూ కరుణ కుమార్ గారి వర్క్ గురించి మాట్లాడుకుంటారు.”
“నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ రెండు సార్లు మిస్ అయింది. ఈసారి మాత్రం గట్టిగా కొడతాను. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తిని కాదు. కానీ ఈసారి సినిమా చూసి నమ్మకంతో చెప్తున్నాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మీ అందరిని అలరిస్తుంది. అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. నేను మాటలు ఆడడం కంటే నా సినిమా మాట్లాడాలని భావిస్తాను. మట్కా 14న వస్తుంది. ధియేటర్స్ లో దుమ్ము దులపపోతుంది. ఇది మాత్రం గ్యారెంటీ.”
“ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. విశాఖపట్నం అంటే సముద్రం గుర్తుకు రావాలి, లేదా ఈ వాసు గాడు గుర్తుకు రావాలి. వాసు గాడు రేపు థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లబోతున్నాడు. వాడితో పాటు ట్రావెల్ అవుతారు. ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా టీమంతా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ” అని అన్నారు హీరో వరుణ్ తేజ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: