మీటర్ తరువాత కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్,సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క పై అంచనాలు ఏర్పడ్డాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అన్ని కుదిరితే ఈనెల 24న ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.రేపు లేదా ఎల్లుండి అనౌన్స్ మెంట్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.కిరణ్ అబ్బవరంకు ఇదే మొదటి పాన్ ఇండియా రిలీజ్.తెలుగులో ఈసినిమాను వంశీ నందిపాటి విడుదలచేస్తుండగా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది.మలయాళంలో క సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.దీపావళి రోజున థియేటర్లలోకి రానుంది.
సుజీత్,సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై కిరణ్ అబ్బవరం భారీ ఆశలు పెట్టుకున్నాడు.గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తనకు క ఆ హిట్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.మరి ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























