దేవర హిందీలో స్టడీ రన్ ను కొనసాగిస్తుంది.బుధవారం ఎక్సలెంట్ గ్రోత్ ను చూపించగా నిన్న కొంచెం నెమ్మదించి డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.గురువారం ఈసినిమా నార్త్ లో 2.40కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.దాంతో వారం రోజుల్లో మొత్తం 48.27కోట్ల నెట్ ను రాబట్టింది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు ఈ ఫీట్ సాధించిన 10వ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఓవరాల్ గా చూస్తే దేవర ప్రస్తుతం హనుమాన్(57కోట్లు) తరువాతి స్థానం లో కొనసాగుతుంది.ఈవారంలో ఈ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం ఖాయమే.మరి ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.వచ్చే వారంలో హిందీలో రెండు నోటెడ్ సినిమాలు కూడా విడుదలకానున్నాయి.ఈనేపథ్యంలో దేవరకు పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో దేవర డామినేషన్ కొనసాగుతుంది.నిన్నటి వరకు 120కోట్లకుపైగా షేర్ ను రాబట్టి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.అటు ఓవర్సీస్ లో 8 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఓవరాల్ గా దేవర అన్ని భాషల్లో కలిపి 400 కోట్ల మార్క్ ను దాటింది.ఎన్టీఆర్ ఈ క్లబ్ లో చేరడం వరసగా ఇది రెండో సారి.సోలో గా ఇదే మొదటిది.
కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.అనిరుధ్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా రానుంది.2026లో దేవర 2 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























