ఎన్టీఆర్ దేవర మరి కొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రానుంది.6ఏళ్ళ తరువాత సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవర పై ముందునుండి భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ఈ సినిమానుండి వచ్చిన ట్రైలర్స్ ,సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ కావడం తో హైప్ డబుల్ అయ్యింది.దాంతో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతున్నాయి.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 75కోట్లు దాటాయి.తొలి రోజు 100కోట్ల మార్క్ చేరుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ అవుతున్నాయి.మిగితా భాషల్లో టాక్ కీలకం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రీ సేల్స్ తో ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా దేవర నిలువనుంది.అటు నార్త్ అమెరికాలో దేవరకు 2.5 మిలియన్ డాలర్ల ప్రీమియర్ సేల్స్ జరిగాయి.దాంతో వరుసగా రెండో సారి ఈ ఫీట్ సాధించిన మొదటి హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు.
ఇక తెలంగాణ లో ఈరోజు రాత్రి సెలెక్టడ్ థియేటర్లలో 1 గంటకు మొదటి షో పడనుంది.టిక్కెట్ హైక్స్ ,ఎక్స్ట్రా షోస్ అడ్వాంటేజ్ కానున్నాయి.దసరా సెలవులు కూడా కలిసిరానున్నాయి.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు దేవర ఓవరాల్ గా 500కోట్ల మార్క్ ను చేరుకోవడం కష్టమేమి కాకపోవచ్చు.ఓటిటి లోకి కూడా అప్పడప్పుడే రాదని అంటున్నారు. 50రోజుల తరువాతే వచ్చే ఛాన్స్ ఉందట.సో లాంగ్ రన్ కంఫర్మ్.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ ఈసినిమా ను తెరకెక్కించగా ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు.వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటి సినిమా.ఎన్టీఆర్ ఆర్ట్స్,యువసుధ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























