తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుల్లో అగ్రతారలుగా వెలుగొందినవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఇరువురూ 250కి పైగా చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా వారు నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి వారు అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ యేడాది అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం. దీనిని పురస్కరించుకుని ఆయన కుటుంబం ఘనంగా వేడుకలు జరపడానికి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మనవడు, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు ఓ కీలక ప్రకటన చేశారు. ఈనెల 20-22 తేదీలలో ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా తన తాత నటించిన 10 చిత్రాలను దేశవ్యాప్తంగా 25 సిటీలలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నామని వెల్లడించారు.
కాగా అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1924 న జన్మించారు. తెలుగు, తమిళం మరియు హిందీ సినిమాలలో నటించారు. 70 సంవత్సరాలకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన 250కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి ఫిల్మ్‌ఫేర్ సహా ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించింది. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి విశిష్ట పురస్కారాలను సైతం అందించింది.
ఇక ఇదిలావుంటే, ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: