ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. నాలుగురోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈసినిమాకు ఏ రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా మరో రీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. కింగ్ నాగార్జున పుట్టినరోజు ఆగష్ట్ 29వ తేదీన అన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమాను నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగష్టు 28వ తేదీన రీరిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. 4K ఫార్మాట్‌లో గ్రాండ్ గా ఈసినిమాను రీరిలీజ్ చేయనున్నారు. 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కానుండటంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి అద్భుతంగా ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు ప్రేక్షకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ‘మాస్’ అప్పటికి నాగార్జునకు హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్‌తో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ కమర్షియల్ హిట్ తో పాటు రాక్‌స్టార్ దేవి శ్రీ కంపోజ్ చేసిన అద్భుతమైన ఆల్బమ్ మ్యూజికల్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: