జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కు హీరో దొరికేసాడు.ఈసినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తరువాత అనుదీప్ ,శివ కార్తికేయన్ తో ప్రిన్స్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత రవితేజ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అయితే అది కుదరలేదు దాంతో ఈ డైరెక్టర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో సినిమా పట్టా లెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇది విశ్వక్ 14వ సినిమాగా రానుంది.ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇప్పటివరకు కామెడీ సినిమాలను డీల్ చేసిన అనుదీప్ ఈసినిమాను కూడా అదే జోనర్ లో తెరకెక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా ఈహీరో,రవితేజ డైరెక్షన్ లో మెకానిక్ రాకీ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా కాకుండా విశ్వక్ సేన్, లైలా అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇందులో అతను లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.రామ్ నారాయణ్ తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.తనిష్క్ బాఘ్చి ,గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.వచ్చే ఏడాది విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: