థియేటర్‌కి పట్టిన తుప్పుని వదలగొట్టే సినిమా ఇది

Actor Ali Hilarious Speech in Double iSmart Trailer Launch Event

ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‍గా వైజాగ్‍లో నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా యాక్టర్ అలీ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కళాకారులని ప్రేమించే నగరం విశాఖ. ఈ వేడుక ఇక్కడ జరగడం ఆనందంగా వుంది. విశాఖ వున్న వజ్రం మా పూరి గారు. రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రామ్ ఎనర్జీతో పూరి గారి డైరెక్షన్ తో మణిశర్మ గారి మ్యూజిక్ తో ఈ సినిమా అద్భుతంగా వుంటుంది” అని తెలిపాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “థియేటర్‌కి పట్టిన తుప్పుని వదలగొట్టే సినిమా ఇది. కావ్య థాపర్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పూరిగా ఓ కొత్త భాషని కనిపెట్టి ఓ అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే” అని అన్నాడు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.