టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్‍ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ నుంచి మేకర్స్ తాజాగా ‘సితార’ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
కాగా ఈ సాంగ్ కాశ్మీర్ లోయలో చిత్రీకరణ జరుపుకుంది. విజువల్ పరంగా చూడటానికి అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో కాశ్మీర్ లోయల్లోని కొండలు, జలపాతాలు కనువిందు చేశాయి. ఇక పాటలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే ఫుల్ జోష్‌తో స్టెప్పులేశారు. దీనికి శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సాంగ్‌కు సాహితి సాహిత్యం అందించగా మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చారు. గాయకులు సాకేత్, సమీరా భరద్వాజ్ ఆలపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























