స్టార్ హీరో తనయుడితో బాలీవుడ్ ఎంట్రీ

Sree Leela Making Her Bollywood Debut

సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లానింగ్స్ చేసుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహారాగ్ని అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో హీరోయిన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన శ్రీలీల. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీలకు ఆసినిమా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. రవితేజ ధమాకా సినిమా మాత్రం శ్రీలీల కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పింది. ధమాకా తరువాత వరుస అవకాశాలు తలుపు తట్టాయి. శ్రీలీల కూడా వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం తన ఖాతాలో పలు సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే శ్రీలీల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తులు వినిపిస్తున్నాయి. అది కూడా స్టార్ హీరో తనయుడు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం హీరోగా దిలర్ సినిమా రాబోతుంది. ఈసినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.