
ట్యాగ్ · 2 కథనాలు


ఆ ఒక్కటీ అడక్కు 3 డేస్ కలెక్షన్స్
అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీసు వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ సీజన్ ను తట్టుకొని పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది.గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈసినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.14కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.4కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈసినిమా మరో రెండు కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈవారంలో ఆ మార్క్ చేరుకొనే ఛాన్స్ వుంది.

ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ డే 1 కలెక్షన్స్
నిన్న విడుదలైన సినిమాల్లో అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగించింది.డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.62కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.బుక్ మై షోలో మొదటి రోజు 16.4 వేలకు పైగా టికెట్స్ తెగాయి.మొత్తానికి మొదటి రోజు డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంది.