శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. తాజాగా ఈసినిమా నుండి శంభో శంభో అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ లిరిక్స్ తో ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటకు శ్రీజో లిరిక్స్ అందించగా దినకర్ కాల్వల ఇంకా లిప్సిక ఆలపించారు.
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























