ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

dhanush and nagarjuna movie title and first look released

మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మరొకటి తెరపైకి వస్తుంది. ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఇన్ని రోజులు డీఎస్ఎన్ అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంది. అయితే ఈసినిమా నుండి టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు కుబేర అనే టైటిల్ ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =