RC16 కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్

noted cinematographer rathnavelu joins in RC16 movie

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో ఈసినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను అప్పుడప్పుడూ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈసినిమాకు సినిమాటోగ్రఫి అందించనున్నారు. నేడు రత్నవేలు పుట్టినరోజు సందర్భంగా ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =