కల్కి 2898 ఏడీ రిలీజ్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

prabhas kalki 2898 ad release date update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత ఏడాది ఈసినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే చిన్న సినిమాలకే విఎఫ్ఎక్స్ పనుల వల్ల లేట్ అవుతున్నాయి. అలాంటిది పాన్ వరల్డ్ రేంజ్లో వస్తున్న సినిమా. అందులోనూ ఈసినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు నాగ్ అశ్విన్. మరి ఈసినిమాకు విఎఫ్ఎక్స్ పనుల్లో లేట్ అవ్వడం కామనే. ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను జనవరి 12వ తేదీన ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.