హనుమాన్ ప్రీమియర్ షోస్ కి షాకింగ్ రెస్పాన్స్ 

huge demand for hanuman Premiere shows

ఈసంక్రాంతికి వస్తున్న సినిమాల్లో స్టార్ క్యాస్ట్ లేకుండా వస్తున్న సినిమా హనుమాన్.తేజా సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.అయితే పేరుకే ఇది మీడియం రేంజ్ సినిమా కానీ బజ్ మాత్రం కావాల్సినంత వుంది.ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించి హైప్ తెచ్చుకుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.నైజాంలో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి సిద్ద పడ్డారు మేకర్స్.జనవరి 11న  సెలెక్టడ్ థియేటర్లలో ఈ ప్రీమియర్లను వేయనున్నారు.ఈటికెట్స్ కోసం ఫుల్ డిమాండ్ వుంది.ఇప్పటికే షోస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి.ఇప్పుడు మరికొన్ని షోస్ ఆడ్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలం లో ఓ మీడియం రేంజ్ సినిమాకి ఇంత హైప్ రావడం ఇదే.మరి రిలీజ్ అయ్యాక  హనుమాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.ఇక ఈసినిమా ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాది భాషలతో పాటు అలాగే హిందీ తోకలిపి స్పానిష్ ,జపనీస్ ,చైనీస్ ఇలా మొత్తం 10భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.తెలుగు తరువాత నార్త్ లో ఈసినిమాకు మంచి క్రేజ్ వస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.