సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి డెవిల్

kalyan ram devil movie successfully entered in second week

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా డీసెంట్ హిట్ నే అందుకుంది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది ఈసినిమా. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి మరో వారం వరకూ సినిమాలు లేవు. ఈ వారం రోజులు కూడా ఈసినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.