పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రిలీజైన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇందులో ప్రభాస్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘వినరా’ అనే వీడియో సాంగ్‌ను మంగళవారం లాంఛ్ చేసింది చిత్ర బృందం. తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. కాగా సలార్‌లో శృతి హాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: