సూర్య, కార్తీ ఔదార్యం.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఆర్ధిక సాయం

Suriya and Karthi Donates Rs.10 Lakh Relief Work To Flood Affected Districts of Tamil Nadu

బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. ప్రముఖ తమిళ నటులు, సోదరులు సూర్య మరియు కార్తీ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని ప్రాంతాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు మరియు తిరువళ్లూరు జిల్లాల వరదలతో అతలాకుతలమైన జిల్లాలకు తమ సహకారాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు. దీనిలో భాగంగా రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళాన్ని తమ అభిమానుల క్లబ్‌ల సమన్వయంతో సహాయం అవసరమైన వారికి పంపిణీ చేయనున్నారు. కాగా సూర్య, కార్తీ చూపిన ఔదార్యానికి నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరు కేవలం తెర మీదే కాకుండా నిజ జీవితంలోను హీరోలేనని కొనియాడుతున్నారు.

ఇక మిచౌంగ్ తుఫాన్ కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడిది. రైల్వే స్టేషన్లలోకి వరద నీరు రావడంతో అనేక రైళ్లను రద్దు చేశారు. అలాగే చైన్నై విమానాశ్రయం రన్‌వే జలమయం కావడంతో విమాన సేవలను నిలిపివేశారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో తుఫాన్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, రెస్క్యూ సహా వివిధ శాఖల సిబ్బందిని పెద్దఎత్తున మోహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =