పాన్ ఇండియా సినిమాాలో రోషన్

roshan to play mohanlals son in vrishabha movie

శ్రీకాంత్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రోషన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆసినిమాలో నటనకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డాక్టర్ కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడి సినిమా చేసి తన ఎనర్జిటిక్ నటనతో మరోసారి మెప్పించాడు. ప్రస్తుతం అయితే ఛాంపియన్ సినిమాతో వస్తున్నాడు. వైజయంతీ మూవీస్ మరియు వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో బంపరాఫర్ కొట్టేశాడు రోషన్. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మలయాళం సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో వృషభ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. నంద కిశోర దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. అయితే ఈసినిమాలో రోషన్ నటించే అవకాశం దక్కించుకున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా ఇచ్చింది చిత్రయూనిట్. మోహన్ లాల్ కుమారుడి పాత్రలో రోషన్ కనిపించనున్నట్టు.. రోషన్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈసినిమాను అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జురీ పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మాథుర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమాా విడుదలవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =