యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ లో ఎంటర్

pawan kalyan enters og set for action packed schedule

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి ఉంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమ రూపొందుతున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను ముంబై, పూణె లో పూర్తి చేశారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ లో ఎంట్రీ ఇచ్చినట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ జరుగుతుందని.. ఫుల్ స్వాగ్, స్టైల్, మాస్ ఇంకా ఎనర్జిటిక్ గా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలియచేశారు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.