జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ దూకుడు

RRR Movie Latest Box Office Collections At Japan

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్నా విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీ జాపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో 5నెలలకు పైగా థియేటర్స్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకూ 1. 4 బిలియన్ యెన్(సుమారు 88 కోట్లు ) కలెక్షన్స్ రాబట్టి 1. 5 బిలియన్ యెన్ దిశగా దూసుకుపోతోంది.ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం అవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగి జపాన్ లో ప్రేక్షకులు ఇంకా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇటీవల ఒక థియేటర్ లో దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అవడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ స్థాయి కలెక్షన్స్ ఎలా సాధ్యమంటూ స్థానిక ఫిలిం మేకర్స్ మరియు బాక్సాఫీస్ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఎన్ని రోజులు జపాన్ లో ఈ సినిమా సందడి చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =