బలగం 25 రోజుల్లో వచ్చిన లాభం

balagam movie completes 25 days

కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈసినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ దిలా రాజ్ ప్రొడక్షన్స్ నుండి వస్తుండటం. ఆ నమ్మకంతోనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. ఇక ఈసినిమా చూసిన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాతలకు లాభాలను మిగల్చింది ఈసినిమా. తాజాగా 25 రోజులను పూర్తిచేసుకుంది ఈసినిమా. ఈ 25 రోజులలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ ను .. 11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 16.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమా 10 కోట్లకి పైగానే లాభాలను రాబట్టిందని అంటున్నారు.

కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =