కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఓటీటీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ

Icon Star Allu Arjun To Give A Grand Entry In OTT
ఓటీటీ1 ని. చదువు

ఓటీటీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ

Icon Star Allu Arjun To Give A Grand Entry In OTT

Icon Star Allu Arjun To Give A Grand Entry In OTT

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది.

తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా పలు ఆసక్తికర షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆహా లో అల్లు అర్జున్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు మాస్ గా చూసి ఉంటారు, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో అల్లు అర్జున్ ని మీ ముందుకి తీసుకోని రాబోతున్నాము. బిగ్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి” అంటూ ఆహా టీమ్ సోషల్ మీడియా లో అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేసింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్