
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.