డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన, పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సాంగ్ కు ఆ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: