బాలకృష్ణ దేవుడు లాంటి మనిషి

Duniya Vijay About Balakrishna And Veera Simha Reddy Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Duniya Vijay,Duniya Vijay Movies,Duniya Vijay New Movie,Duniya Vijay Latest Movie,Duniya Vijay About Balakrishna And Veera Simha Reddy,Duniya Vijay About Balakrishna,Duniya Vijay About Veera Simha Reddy Movie

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ‘వీరసింహారెడ్డి’ లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వీరసింహారెడ్డి’తో మీ ప్రయాణం ఎలా మొదలైయింది?
దర్శకుడు గోపీచంద్ గారు ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ‘వీరసింహారెడ్డి’ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.

ఈ పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించినపుడు మిమ్మల్నే ఎందుకు ఎంచుకుంటున్నారని దర్శకుడిని అడిగారా ?
అడిగాను. గోపిచంద్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని ఆయనకి అనిపించింది. ఇది లక్, గుడ్ టైం.

ఇందులో మీ లుక్ ఎలా వుంటుంది ?
చాలా మొరటుగా వుంటుంది. స్క్రీన్ పై చాలా మార్పు కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ముస‌లిమ‌డుగు ప్రతాప్ రెడ్డి.

బాలకృష్ణ గారితో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను.

బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ పవర్ ఫుల్ గా వుంటాయి. మరి వీరసింహా రెడ్డి లో ఎంత పవర్ ఫుల్ గా వుంటాయి?
చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలవుతారు. ఇందులో బాలకృష్ణ గారితో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది.

వీరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది ?
వీరసింహారెడ్డి అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ.

వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత.. విలన్ గా పాత్రలని కొనసాగిస్తారా ?
మంచి పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది.

మీరు దర్శకుడు కూడా కదా.. నటనలో దర్శకత్వ నైపుణ్యత ఎంతవరకూ ఉపయోగపడుతుంది ?
నటన, దర్శకత్వం రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా దృష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది.

మీకు తెలుగులో ఇష్టమైన హీరోలు ?
ఒకరని చెప్పలేను. అందరూ ఇష్టమే. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
‘భీమా’ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. పాత్ర బలంగా వుంటే తప్పకుండా చేస్తాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seventeen =