నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా కూడా సంక్రాంతికి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్లుగానే నిలిచాయి. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టేశారు. షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజ్ అయిన ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: