మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా కెరీర్ లో కొనసాగుతున్నారు. అందులో సాయి తేజ్ కూడా ఒకరు. తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నాడు సాయితేజ్. గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు సాయితేజ్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమాకు టైటిల్ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కు ఎన్టీఆర్ వాయిస్ అందిస్తుండటంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఈసినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢనమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజం ఆయనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజ్జాన్ని చూపించే మరో నేత్రమే ‘విరూపాక్ష’ అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా వాయిస్ అందించాడు. ఈ గ్లింప్స్ లో సాయిధరమ్ తేజ్ ఊరి జనానికి కాగడాతో ఎదురు నిలబడి కనిపిస్తున్నాడు. మొత్తంగా విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది.
Here’s #Virupaksha Title Glimpse we have put in much love & efforts.
Wish it all pays off with your love 🤗https://t.co/OXQ4ykpykW
Thank you Tarak @tarak9999 🤗@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/z1QjM9MiT4
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 7, 2022
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: