భార్యకు నాని లవ్లీ బర్త్ డే విషెస్

Nani's lovely birthday wishes to his wife, Natural Star Nani Birthday Wishes To His Wife, Nani Birthday Wishes To His Wife, Natural Star Nani, Nani Birthday Wishes, Nani Birthday Greetings, Nani Latest Movie, Nani Upcoming Movie, Nani Movies, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్పెషల్ పేజీని ఏర్పాటుచేసుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని.. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక సోషల్ మీడియాలో కూడా నాని యాక్టీవ్ గానే ఉంటాడు. నాని కూడా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూనే ఉంటాడు. నేడు తన భార్య అంజన పుట్టినరోజు సందర్భంగా తనకు బర్త్ డే విషెస్ అందించాడు. కొన్నేళ్ల క్రితం ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ నువ్వు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ హ్యాపీ బర్త్ డే టూ యు అంజన అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నాని ఈ ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో మొదటి సారిగా నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + one =